తెలంగాణలో 121 కరోనా కేసులు: 8 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్, పెరిగిన రికవరీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 25,021 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 121 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 121 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,71,463కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3956గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 540 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

 121 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,63,498కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,009 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 01, జీహెచ్ఎంసీలో 55. జగిత్యాలలో 01, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 04, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 01, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 06, ములుగులో 01, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 03, నారాయణపేటలో 02, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 01, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 02, వికారాబాద్ లో 00, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 03, యాదాద్రి భువనగిరిలో 01 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11.35,142 నమూనాలను పరీక్షించగా.. 12,830 మందికి కరోనా సోకినట్లు తేలింది. శనివారం 446 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,58,186కి చేరింది. తాజాగా, 14,667 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. రికవరీ రేటు 98.20 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,59,272కి తగ్గింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. శనివారం 68,04,806 మందికి టీకా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు కరోనా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 1.06 కోట్లు దాటింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+