తెలంగాణలో కొత్తగా 122 కరోనా కేసులు: 10 జిల్లాల్లో ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే(111) గత 24 గంటల్లో కేసులు స్వల్పంగా పెరిగాయి. 26,676 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 122 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,68,955కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3938గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 540 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

 122 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,61,093కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3924 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 08, జీహెచ్ఎంసీలో 55. జగిత్యాలలో 03, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 09, ఖమ్మంలో 07, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 02, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 04, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 03, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 01, రాజన్న సిరిసిల్లలో 01, రంగారెడ్డిలో 09, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 01, సూర్యాపేటలో 02, వికారాబాద్ లో 01, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 01, వరంగల్ అర్బన్‌లో 03, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం అసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణ్ పేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand

    మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవి 229 రోజుల కనిష్టానికి చేరడం గమనార్హం. శనివారం 144 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,52,142కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గత సంవత్సరం మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి తగ్గింది. పాజిటివిటీ రేటు 0.57 శాతానికి తగ్గి 220 రోజుల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. శనివారం 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేయగా, ఇప్పటి వరకు ఏదో ఒక టీకా డోసు తీసుకున్నవారి సంఖ్య 97.65 కోట్లు దాటింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+