నీళ్ల కోసం వెళ్తే.. కాటేసిన కామాంధుడు: థియేటర్ లో బాలికపై అత్యాచారం..

హైదరాబాద్: మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలకు తెరపడటం లేదు. ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేస్తున్నా అత్యాచార ఘటనలకు తెరపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ బోరబండలో ఓ మైనర్ బాలిక(14)పై ప్రశాంత్(25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. బోరబండలో నివసించే ఓ బాలిక మంచినీళ్ల కోసం ప్రతీరోజు విజేత థియేటర్ ఆవరణలోని నల్లా వద్దకు వస్తుంది. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం 7 గం. సమయంలో బాలిక తన వదినతో కలిసి అక్కడికి వచ్చింది. బాలిక వదిన బిందెలో నీళ్లు తీసుకుని వెళ్లగా.. బాలిక మరిన్ని నీళ్లు పట్టడం కోసం అక్కడే ఉంది.

13-year-old girl raped by cinema worker in Hyderabad

ఇంతలో అక్కడికి వచ్చిన ప్రశాంత్ అనే యువకుడు బాలికను బలవంతంగా థియేటర్ మరుగుదొడ్డిలోకి లాక్కుపోయాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించి కేకలు వేయగా.. ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. ఆపై ఆమెపై అత్యాచారం జరిపాడు. బాధితుడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని.. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు విజేత థియేటర్ లో స్వీపర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+