తెలంగాణలో 1300కుపైగా కరోనా కేసులు: పెరిగిన రికవరీ, జిల్లాలవారీగా కొత్త కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొద్ది వారాలుగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా కేసులు వరుసగా 1500లోపే నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1.23,005 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1362 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను శనివారం సాయంత్రం రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు, 10 మరణాలు

తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు, 10 మరణాలు

తాజాగా, నమోదైన 1362 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,12,196కు చేరింది. కరోనాతో ఒక్కరోజు వ్యవధిలో 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3556కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

తెలంగాణలో 18,568 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 18,568 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1813 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,90,072కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 96.38 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ ప్రకటించింది.

Recommended Video

    COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu
    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 05, భద్రాద్రి కొత్తగూడెంలో 81, జీహెచ్ఎంసీలో 145. జగిత్యాలలో 25, జనగామలో 16, జయశంకర్ భూపాలపల్లిలో 25, జోగులాంబ గద్వాలలో 9, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 84, ఖమ్మంలో 122, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 05, మహబూబ్‌నగర్‌లో 26, మహబూబాబాద్‌లో 66, మంచిర్యాలలో 42, మెదక్‌లో 08, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 66, ములుగులో 24, నాగర్ కర్నూలులో 16, నల్గొండలో 83, నారాయణపేటలో 07, నిర్మల్‌లో 05, నిజామాబాద్‌లో 06, పెద్దపల్లిలో 58, రాజన్న సిరిసిల్లలో 26, రంగారెడ్డిలో 97, సంగారెడ్డిలో 24, సిద్దిపేటలో 41, సూర్యాపేటలో 89, వికారాబాద్‌లో 26, వనపర్తిలో 34, వరంగల్ రూరల్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 52, యాదాద్రి భువనగిరిలో 27 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+