అవినీతి తిమిగంలం శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో శివబాలకృష్ణ ఇంటితోపాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు సీజ్ చేశారు.
అనంతరం బాలకృష్ణను బుధవారం అరెస్ట్ చేసిన అధికారులు గురువారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో శివబాలకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, బుధవారం, గురువారం ఉదయం శివబాలకృష్ణ నివాసంతోపాటు ఆయన బంధువులు, సహచరుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రూ. 99.60 లక్షల నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల వెండిని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. దాదాపు 8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన కార్లు, ఐఫోన్లు, వందకుపైగా ఖరీదైన చేతి గడియారాలు సీజ్ చేశారు.
మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ ఆస్తుల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడబెట్టిన శివబాలకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications