హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కరోనా వ్యాప్తి: కొత్తగా 1673 కొత్త కేసులు, ఒకరు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 48,583 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 4042కి చేరింది. కరోనాబారి నుంచి శనివారం 330 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 13,162 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా గత 24గంటల్లో 1,165 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డిలో 44, హన్మకొండలో 34 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

 1673 fresh coronavirus cases, one death reported in Telangana

కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోండి: సీఎం కేసీఆర్

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కరోనా పట్ల భయాందోళనలు అక్కెరలేదని ప్రజలకు సీఎం తెలిపారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు.

అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం అన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెల్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు.

ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా వుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గత రివ్యూ సందర్భంగా సీఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా వున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

English summary
1673 fresh coronavirus cases, one death reported in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X