కస్బుర్బా పాఠశాలలో కరోనా కలకలం: 16 మంది విద్యార్థులు, ఒక టీచర్‌కు పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాలలో కరోనా కలకలం కరోనా కలకలం రేపింది. గురువారం ఉదయం విద్యార్థులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు.
ఈ క్రమంలో వైద్య సిబ్బంది కస్తూర్బా పాఠశాలకు వచ్చి 20మంది విద్యార్థినులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రిన్సిపల్ గీత విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాల దేవరకొండలో కొనసాగుతోంది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం 992 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,22,663కు పెరిగింది. హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కరోనా వైరస్ బారినపడ్డారు.












Click it and Unblock the Notifications