తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, తొమ్మిది జిల్లాల్లో సున్నా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 38,373 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 171 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 171 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,71,000కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3952గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1702 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,922కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,126 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 58. జగిత్యాలలో 06, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 13, ఖమ్మంలో 06, కొమురంభీం ఆసిఫాబాద్ లో 02, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 03, మంచిర్యాలలో 02, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 11, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 04, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 06, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 02, వికారాబాద్ లో 00, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 02, వరంగల్ అర్బన్‌లో 13, యాదాద్రి భువనగిరిలో 04 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.90,900 నమూనాలను పరీక్షించగా.. 16,156 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు పెరిగింది. బుధవారం 733 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మరణాల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 622 ఉండటం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,56,386కు పెరిగింది. గత 24 గంటల్లో 17,095 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పెరగ్గా, పాజిటివిటీ రేటు 0.47 శాతానికి తగ్గింది. బుధవారం 49,09,254 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ శారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య 104 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications