తెలంగాణలోకొత్తగా 174 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, ఏడు జిల్లాల్లో కొత్త కేసుల్లేవు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 38,442 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 174 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 174 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,71,174కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3954గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 2005 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

174 new corona cases, 2 death reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,63,124కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,096 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 03, జీహెచ్ఎంసీలో 65. జగిత్యాలలో 04, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 14, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 03, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 13, ములుగులో 00, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 06, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 03, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 09, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.84,552 నమూనాలను పరీక్షించగా.. 14,348 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసులు 3.42కోట్లకు పెరిగాయి. గురువారం మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 805 మంది మరణించారు. అయితే, ఇందులో 708 మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఉండటం గమనార్హం. కాగా, గురువారం 13,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.36 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.19 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. గురువారంనాడు 74,33,392 మందికి టీకా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 104.82 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+