తెలంగాణలో కొత్తగా 177 మందికి సోకిన కరోనా: 2వేల లోపునకు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 41,343 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 177 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,101కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
బుధవారం కరోనా బారినపడి మర ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1606కు చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 198 మంది రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,91,510కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1985కి తగ్గింది. వీరిలో 776 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 79,96,651 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఇక దేశంలోనూ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బుదవారం 12,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,07,90,183కి చేరింది. గత 24 గంటల్లో 107 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 1,54,703 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,55,025 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,824 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోటి 4లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.












Click it and Unblock the Notifications