అరుదు: ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు (ఫోటో)
హైదరాబాద్: ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చిన సంఘటన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఉర్సు ప్రాంతానికి చెందిన ఎండీ రొకియా (19) భర్త హుస్సేన్ వీరికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది.
అయితే రొకియాకు ఎనిమిది నెలలు నిండగానే 20 రోజుల కిందట నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని సీకెఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించి, రొకియా పరిస్ధితి విషయంగా ఉందని వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన రొకియాకు ఇక్కడ 20 రోజుల పాటు ఆమెకు చికిత్సను అందిస్తూ పరిశీలనలో పెట్టారు. కాగా మంగళవారం ఉదయం వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు మగ బిడ్డలను బయటకు తీశారు.
తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తొలి కాన్పులో ఇలా ముగ్గురు పుట్టడం అరుదైన విషయమని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications