వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగడం కోసం ఏకంగా ఫోర్జరీలకే తెరలేపాడు.. చివరికి షాక్ తప్పలేదు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిండా 19 ఏళ్లు లేవు.. చదువులో ఉండాల్సిన ముందు చూపు మందు మీద చూపించాడు. మధ్యం సేవించడానికి వయసు అడ్డంకిగా మారడంతో.. డ్రైవింగ్ లైసెన్స్ పై ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో అంకెల గారడీ చేశాడు. లైసెన్స్ ఫోర్జరీ అయితే చేశాడు గానీ తనిఖీల్లో మాత్రం అసలు లైసెన్స్ ను చూపించి బుక్కయిపోయాడు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీకి చెందిన విశేష్ అగర్వాల్ (19 )కు మధ్యం తాగడానికి అతని వయసు అడ్డంకిగా మారింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ పై 1997 గా ఉన్న అతని పుట్టిన తేదీలో మార్పులు చేసి, చివరి అంకె 7 ను కాస్త నాలుగుగా మార్చేశాడు. 1994 డేట్ ఆఫ్ బర్త్ తో ఓ ఫోర్జరీ లైసెన్స్ ను స్రుష్టించుకుని కలర్ జిరాక్స్ తీయించి లామినేషన్ చేయించుకున్నాడు.

19years old boy made forgery for his driving license

ఈ నేపథ్యంలోనే మధ్యం సేవించడం కోసం మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లాడు. ఫూటుగా మధ్యం సేవించి నిండా మత్తులో మునిగిపోయాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి బార్ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా.. విశేష్ అగర్వాల్ వద్దకు వెళ్లిన పోలీసులు లైసెన్స్ చూపించాలని కోరగా, ఫోర్జరీ లైసెన్స్ చూపించబోయి అసలు లైసెన్స్ చూపించడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో బార్ సిబ్బందిని పోలీసులు నిలదీయగా.. తాము సోదా చేసిన తర్వాతే లోనికి అనుమతించామని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విశేష్ ను సోదా చేయగా ఫోర్జరీ లైసెన్స్ బయటపడింది. ఇక చేసేదేమిలేక విశేష్ కూడా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై పలు కేసులు నమోదవగా ప్రస్తుతం అతడు జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

English summary
Vishesh Agarwal a 19 years old boy made forgery for his driving license. In a Jubilee Hills bar while having alcohol police arrested him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X