తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లోనూ ఎక్కువ కేసులు

హైదరాబాద్: తెలంగాణ కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షలను పెంచుతున్నకొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54,443 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,93,600కి చేరింది.

వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. గత 24 గంటల్లోనే కరోనా బారి నుంచి 2474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది.

 2,214 fresh corona cases in telangana, 8 deaths

తెలంగాణలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 23,702 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోనే 305 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెంలో 99, జీహెచ్ఎంసిలో 305, కరీంనగర్‌లో 106, మేడ్చల్ లో 153, నల్గొండలో 149, రంగారెడ్డిలో 191, వరంగల్ అర్బన్ లో 131 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Sonu Sood Conferred With UNDP Award | Joins Priyanka Chopra, Angelina Jolie, Leonardo DiCaprio

    మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశంగా. ఇప్పటి వరకు దేశంలో 63,16,459 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,43,932 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 52,72,880 మంది కోలుకున్నారు.
    98,739 కరోనా బారిన పడి మరణించారు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+