విద్యార్థులను తల కిందుల నిల్చోబెట్టి చితకబాదాడు

Posted By:
Subscribe to Oneindia Telugu
  మైనర్ బాలురను చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ : Video Viral in social media

  మెదక్: ఇద్దరు విద్యార్థుల చేత గోడకు శీర్షాసనం వేయించి, ఓ వార్డెన్ చితకబాదిన ఉదంతం వెలుగు చూసింది. కాళ్లను గోడకు ఆనించి, తలలు కిందకు ఉచి ఆ తర్వాత పైప్‌తో చితకబాదుతూ వార్డెన్ ఇద్దరు మైనర్ బాలురను చిత్రహింసలు పెట్టాడు.

  అల్లరి చేశారనే కారణంతో ఏడో తరగతి చదువుతున్న ఆ విద్యార్థులకు వార్డెన్ కఠిన దండన విధించాడు. హైదరాబాదుకు వంద కిలోమీటర్ల దూరంలో గల జహీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఈ తంతు తరుచుగా జరుగుతోందని అంటున్నారు.

  2 Minors Forced To Stand Upside Down, Beaten Up By Warden

  మైనర్లను తల కిందుల ఉంచి, చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విద్యార్థులు కొట్టుకున్నారని తమకు ఫిర్యాదు చేశారని, మందలించడానికి మాత్రమే అలా చేశానని వార్డెన్‌ సంజాయిషీ ఇచ్చారని గిరిజన సంక్షేమశాఖ అధికారి మణెమ్మ అంటున్నారు.

  గతంలోనూ విద్యార్థుల గొడవని తల్లిదండ్రుల దృష్టి తీసుకెళ్లామని, అయినప్పటికీ మార్పు రాకపోవడంతో భయం చెప్పానని వార్డెన్‌ తెలిపారని మణెమ్మ చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్టీ హాస్టల్ వార్డెన్ యాదయ్య ఇద్దరు విద్యార్థుల పైశాచికంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు రోజు క్రితం ఈ సంఘటన జరిగింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A video of two minors being made to stand upside down and thrashed repeatedly if they tried to relax or sit has emerged in Zaheerabad hostel.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X