తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ, జిల్లాలవారీగా కొత్త కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 47,465నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 201 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,67,535కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3927గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1726 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,59,263కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4345 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 08, జీహెచ్ఎంసీలో 64. జగిత్యాలలో 03, జనగామలో 03, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 09, ఖమ్మంలో 04, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 06, మంచిర్యాలలో 06, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 08, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 11, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 05, పెద్దపల్లిలో 08, రాజన్న సిరిసిల్లలో 04, రంగారెడ్డిలో 12, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 07, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 06, వరంగల్ అర్బన్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 04 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 13,85,706 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21,257 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. దీంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరాయి. కరోనా బారినపడి 271 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,50,127కి చేరింది.
రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. గురువారం 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్ల(97.96 శాతం) మార్కును దాటాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,40,221కు తగ్గింది. క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. ఇక గత 24 గంటల్లో 50.17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 93 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications