డిసెంబరు 3వ తేదీ అంటే బీఆర్ఎస్‌కు ఒక పీడకల
డిసెంబరు 3వ తేదీ అంటే తెలంగాణ ప్రజలకన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికన్నా ఎక్కువగా గుర్తుండిపోయేది భారత రాష్ట్ర సమితి పార్టీకే. ఎందుకంటే 2023వ సంవత్సరం డిసెంబరు3వ తేదీన భారత రాష్ట్ర సమితికి ఒక పీడకలను మిగిల్చింది. ఆ తర్వాత ఆ పార్టీకి అన్నీ కష్టాలే. అందుకు కారణం ఏమిటంటే.. కేసీఆర్.. తన చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలై అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు.
రేవంత్ రెడ్డి కష్టపడటమే ఇందుకు ప్రధాన కారణం. తానొక పోరాట యోధుడినని చాటిచెబుతూ విజేతగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలోని ఏ సీనియర్ నేత కూడా తన నియోజకవర్గం దాటి బయటకు రాని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేసి, ప్రతి నియోజకవర్గం పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపారు.

విజేతలే విజేతగా నిలుపుతారు
ఆ ఆత్మవిశ్వాసమే కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేసింది. అయితే సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలోనే కాంగ్రెస్ కు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్నే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితమే అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పార్టీని విజేతగా నిలిపారు. ఆ తర్వాతే కేసీఆర్ బాత్ రూంలో కాలుజారి పడ్డారు. పదవి చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు.
6 నెలల్లో మారిపోయిన వాతావరణం
ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పార్టీలో, అధిష్టానం వద్ద తన పట్టును బాగా పెంచుకున్నారు. ఒకరకంగా రేవంత్ పడిన అవమానాలు ఏ కాంగ్రెస్ నేత పడలేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్‌ను ఓడించడానికే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి.. తనను ప్రత్యర్థిగా కేసీఆరే ఎంచుకున్నారని ప్రచారం చేశారు. దీనివల్ల ఇమేజ్ పెరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ బండిని తప్పించడం ఘోర తప్పిదంగా మారింది. ఒకరకంగా తెలంగాణలో పార్టీ ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు.
వెంటనే రేవంత్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆరు నెలల్లో మొత్తం రాజకీయ వాతావరణం మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణలో సాధించలేని సీట్లను కాంగ్రెస్ పార్టీకి రేవంత్ సాధించి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగులని నాయకుడిగా చెలామణి అవుతున్న రేవంత్ 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో కలపడంద్వారా దేశంలోనే అతి పెద్ద నగరాన్ని ఆవిష్కరించినట్లైంది. ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి గేమ్ ఛేంజర్ గా నిలవబోతోంది.












Click it and Unblock the Notifications