కరోనా అప్‌డేట్ : తెలంగాణలో భారీగా నమోదైన కేసులు... ఎనిమిది మంది మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల క్రితం వరకూ 500 మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా 3వేల మార్క్‌కి అటు ఇటుగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మరో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. మరో 4959 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (ఏప్రిల్ 14) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    #Telangana #Corona 14-04-2021 తెలంగాణ‌ కరోనా అప్డేట్: కొత్తగా 2,157 కేసులు నమోదు

    తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1780కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 16,892 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 821 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది.

    2157 new coronavirus cases and 8 deaths reported in telangana

    ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 88.89 శాతం ఉండగా తెలంగాణలో 91.86 శాతం ఉంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 361 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02,10,906 కరోనా టెస్టులు నిర్వహించారు.

    కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,10,611 మంది మొదటి డోసు,3,12,340మందికి రెండో డోసు ఇచ్చారు. మంగళవారం(ఏప్రిల్ 13) ఒక్కరోజే 31,077 మందికి టీకా మొదటి డోసు,2506 మందికి టీకా రెండో డోసును ఇచ్చారు.

    దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,72,085కి చేరింది. కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో సెక్షన్ 144 విధించారు. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+