తెలంగాణాలో రోజుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే .. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో షాకింగ్ డేటా!!

సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు దేశవ్యాప్తంగా పెరిగిపోయారు. అమ్మ తిట్టిందని, నాన్నకోపడ్డాడని, ఫోన్ కొనివ్వలేదని, గేమ్స్ ఆడుకోనివ్వలేదని ఇలా సిల్లీ కారణాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు లేకపోలేదు. ప్రేమ విఫలమైందని కొందరు యువకులు, కుటుంబ కలహాలతో కొందరు మహిళలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న జాబితా చూస్తే ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో చాంతాడంత కనిపిస్తుంది. మానసికంగా తీవ్ర వేదనకు గురైన తర్వాత తీసుకున్న నిర్ణయంగా ఆత్మహత్య కనిపిస్తుంది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రస్తుత సమాజంలో ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి.

తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య

తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2020లో 8058 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2019లో ఆ సంఖ్య 7675 గా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా పేర్కొంది. తెలంగాణలో రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తాజాగా వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, 2020లో రోజుకు సగటున 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే గంటకు దాదాపు ఒక ఆత్మహత్య జరుగుతుందని అంచనా.

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 21.5 శాతం

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 21.5 శాతం

ఇక 2019తో పోలిస్తే, 2020లో ఆత్మహత్యల సంఖ్య దాదాపు 5.05 శాతం పెరిగింది. ఆత్మహత్యల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న దేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది . ప్రస్తుతం ఇదే అందరికీ ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 21.5 శాతంగా ఉన్నట్టు సమాచారం. ప్రజలలో పెరిగిపోతున్న మానసిక దౌర్బల్యమే అందుకు కారణం అని తెలుస్తుంది. కారణం ఏదైనా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలని తెలుస్తుంది.

తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం ఇదే

తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం ఇదే

50 శాతానికి పైగా కేసుల్లో ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమని తేలింది. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో జీవించడం వల్ల కుటుంబ వివాదాలు సులువుగా పరిష్కారమయ్యేవని, ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు చిన్న కుటుంబాల వ్యవస్థ కారణంగా, క్షణికావేశంలో ఆత్మహత్యలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది ఆందోళన కలిగిస్తోందని సైకియాట్రిస్ట్ వైద్యులు చెప్తున్నారు. ఇదిలావుండగా, యువకులు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో, యువకుల ఆత్మహత్యలకు తోటివారి ఒత్తిడి ఒక కారణమని మానసిక వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మొత్తం భారతదేశంలో ఆత్మహత్యల సంఖ్య

మొత్తం భారతదేశంలో ఆత్మహత్యల సంఖ్య


నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన మొత్తం లెక్కల ప్రకారం, మొత్తం భారతదేశంలో, 2020లో 1,53,052 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇది 2019లో దేశంలో జరిగిన ఆత్మహత్యల కంటే 10 శాతం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది . దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1 శాతం ఉన్నాయి. అంటే దాదాపు సగం ఆత్మహత్యలు ఈ రాష్ట్రాలలోనే జరిగినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+