కృష్ణా తీరంలో విషాదం: విష గుళికలు తిని 25 జింకలు మృతి
మహబూబ్‌నగర్: రైతులు పంట రక్షణకోసం పొలాల్లో వేసిన పురుగు నివారణ గుళికలు తిని 25 జింకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ సమీపంలోని కృష్ణానది తీరంలో శనివారం చోటుచేసుకుంది.
పెబ్బేరు మండలం గుమ్మడం, యాపర్ల, తిప్పాయిపల్లి, పెంచుకలపాడు గ్రామాల పరిధిలోని కృష్ణానది తీరంలో వందలాది జింకలు ఉన్నాయి. నదికి నీరు ఉద్ధృతంగా రావడంతో జింకలు గుమ్మడం శివారులోని పొలాల్లోకి వచ్చాయి.

రైతులు పొలాల్లో చల్లిన గుళికలను తిని మృతిచెందాయి. స్థానికులు అటవీ అధికారులకు శనివారం సమాచారం అందించారు. 25 జింకలు చనిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు. ఇందులో 21 ఆడ, 4 మగజింకలు ఉన్నాయి.
వీటికి పెబ్బేరు పశువైద్య అధికారి మల్లేష్ పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా జింకల మృతికిగల కారణాలను వెల్లడించి చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖాధికారి గంగారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications