కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...

తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 717 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 5) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    Covaxin Emergency Use:India approves Serum-Oxford, Bharat Biotech's COVID vaccines for Emergency Use

    తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1554కి చేరింది. ప్రస్తుతం 5039 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2793 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 317 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,81,400కి చేరింది.

    253 new coronavirus cases and 3 deaths reported from telangana

    గడిచిన 24గంటల్లో మొత్తం 42,485 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 70,61,049కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,89,711 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.3 శాతం ఉండగా తెలంగాణలో 97.71శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 61,వరంగల్ అర్బన్ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

    ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16375 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కోట్లకు చేరగా... మృతుల సంఖ్య 1,49,850కు చేరింది. ఇప్పటివరకూ 99,75,958 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 2,31,036 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.దేశంలో కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+