తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 55,419 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 258 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 258 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,64,164కు చేరింది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3908కిచేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1483 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

258 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,55,310కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,946 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 03, జీహెచ్ఎంసీలో 69. జగిత్యాలలో 08, జనగామలో 10, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 02, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 25, ఖమ్మంలో 15, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 04, మంచిర్యాలలో 09, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 13, ములుగులో 02, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 12, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 08, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 21, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 07, వరంగల్ అర్బన్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్ పల్లి, నారాయణ్ పేట్, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఇక దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు మాత్రం 300కు పైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,92,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లకు పెరిగింది. ఆదివారం 383 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45లక్షలకు పెరిగింది. మంగళవారం 34వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.90 శాతానికి తగ్గింది. మంగళవారంనాడు 75,57,529 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 82.65 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+