తెలంగాణలో కొత్తగా 27 కేసులు నమోదు: కరోనాతో మరో ఇద్దరు మృతి
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కూడా కరోనా కేసులు పెరుగుదల నమోదు చేశాయి. రాష్ట్రంలో కొత్తగా 27 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస కార్మికులు కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
కొత్తగా నమోదైన 27 కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1661కి చేరింది. బుధవారం ఇద్దరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స పొందుతూ ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 608 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. గత 14 రోజులుగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications