రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న లారీ, బైక్‌ను ఢీ కొట్టడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం యనం పేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మాల్కాజ్‌గిరికి చెందిన సతీష్ హబ్సిగూడలోని జెక్‌ప్యాక్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కాగా, గురువారం బైక్‌పై వెళ్తున్న సతీష్ వేగంగా వెళ్తున్న కంటెనర్ లారీ యనం పేట వద్ద ప్లైఓవర్ బ్రిడ్జీ వద్ద ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టు మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications