coronavirus:కుత్బుల్లాపూర్ 3 జోన్లలో కంటైన్మెంట్ ఎత్తివేత, 14 రోజులుగా నో పాజిటివ్ కేసు...
కరోనా వైరస్ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కొన్నిప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఆ జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేరింది. వాస్తవానికి హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల కేసులు తగ్గడం ఊరటనిచ్చే అంశం.
నియోజకవర్గంలోని అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్‌లో కంటైన్మెంట్ ఎత్తివేసినట్టు అధికారులు ప్రకటించారు. 14 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలతో అధికారులు కంటైన్మెంట్ ఎత్తివేశారు. మూడు జోన్లలో పోలీసుల సహకారంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జనం లాక్ డౌన్‌కు సహకరించేలా తగిన చర్యలు తీసుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు సహకారం, ప్రజల సపోర్ట్ చేయడంతో వైరస్ ప్రబలలేదు.

Recommended Video
కరోనా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. తర్వాత నిజామాబాద్, సూర్యాపేట ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మూడు జోన్లను ఎత్తివేయడంతో ఉపశమనం కలిగించే అంశం. ఇక్కడి మాదిరిగానే మిగతాచోట్ల కూడా వ్యవహరిస్తే.. కరోనా వైరస్ రక్కసిని సమూలంగా నిర్మూలించొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications