భద్రాచలం గర్భగుడిలోకి జంట: ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో సాలూరి రమేష్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో సాలూరి రమేష్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు శేష గోపాలాచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ కిషోర్‌లను సస్పెండ్ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

సోమవారం నాడు సాయంత్రం సమయంలో ఓ జంట గర్భగుడిలోని మూల విరాట్ వద్దకు వెళ్లి పూజలు చేశారు. మూల విరాట్ వద్దకు భక్తులు వెళ్లి పూజ చేయడం ఆచార సంప్రదాయాలకు విరుద్ధం.
దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే దంపతులు గర్భగుడిలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో సోమవారం సాయంత్రం విధుల్లో ఉన్న ఈ ముగ్గురినీ బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications