చేవేళ్ల ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ. 25 కోట్లు డిమాండ్
హైదరాబాద్: ‘నామినేషన్ పత్రాల్లో ఎలక్షన్ కమిషన్‌కు మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి' అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొద్ది రోజుల క్రితం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది.
ఎంపీ ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మాజీ ఎంపీ బంధువు ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్‌కు చెందిన వెకంట రమణారెడ్డి, బెంగుళూరుకు చెందిన రాజేష్, కుమార్‌లు కలిసి ఎంపీ కుమారుడు కొండా అనిధిత్ రెడ్డికి డిసెంబర్ 8వ తేదీన మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో బెదిరించారు.
ఈ మెయిల్‌ను అతడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి చూపించాడు. రెండు రోజులకు మరో మెయిల్ పెట్టారు. రెండో రోజు సెల్‌ఫోన్‌లో కూడా వేధించడం ప్రారంభించారు. ఇక లాభం లేదనుకుని ఎంపీ జనవరి 8వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
కమీషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదు చేసుకుని ఎస్‌ఐలు కె. శ్రీనివాస్, కె. విజయవర్ధన్‌లతో కలిసి నిందితులతో రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications