ఒకరిని కాపాడేందుకు ఒకరు బావిలో దూకిన ముగ్గురు మృతి
ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో జరిగింది. కిష్టం పల్లికి చెందిన జ్యోతి (16) కుటుంభ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు బావిలోకి దూకింది. అది గమనించిన జ్యోతి అన్నలు ఇద్దరు వెంటనే ఆమేను కాపాడేందుకు వెళ్లారు. చెల్లిని కాపాడేందుకు ఇద్దరు అన్నదమ్ములైన రమేశ్ (19) ,సంజీవ్ (23) లు ఇద్దరు కూడ బావిలోకి దూకారు.

అయితే దురదృష్టవశాత్తు చెల్లికాపాడే ప్రయత్నంలో ఇద్దరు కూడ నీట మునిగి ప్రాణాలు విడిచారు. మరోవైపు అటు ముందు దూకిన చెల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో అది కూడ ఒకరిని కాపాడేందుకు మరోకరు బావిలో దూకడం తో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంభ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి.












Click it and Unblock the Notifications