తెలంగాణలో కొత్తగా 3043 కరోనా కేసులు: 40వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 59,709 నమూనాలను పరీక్షించగా.. 3043 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల 5,56,320కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 33146కు పెరిగింది.
కొత్తగా 4693 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,13,968కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 424 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206 యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్-18, భద్రాద్రి కొత్తగూడెం-61, జీహెచ్ఎంసీ-424, జగిత్యాల-86, జనగాం-35, జయశంకర్ భూపాలపల్లి-54, జోగులాంబ గద్వాల-54, కామారెడ్డి-23, కరీంనగర్-162, ఖమ్మం-198, కొమురంభీం ఆసిఫాబాద్-30, మహబూబ్‌నగర్-92, మహబూబాబాద్-63, మంచిర్యాల-99, మెదక్-38, మేడ్చల్ మల్కాజ్‌గిరి-185, ములుగు-59, నాగర్‌కర్నూలు-53, నల్లగొండ-159, నారాయణపేట-30, నిర్మల్-17, నిజామాబాద్-46, పెద్దపల్లి-106, రాజన్న సిరిసిల్ల-67, రంగారెడ్డి-165, సంగారెడ్డి-49, సిద్దిపేట-101, సూర్యాపేట-130, వికారాబాద్-105, వనపర్తి-71, వరంగల్ రూరల్-109, వరంగల్ అర్బన్-111, యాదాద్రి భువనగిరి-43 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న డీజీపీ.. సోమవారం ఆకస్మికంగా నాగోల్ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. అక్కడ లాక్‌డౌన్ అమలుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
Recommended Video
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, వారిని అనుమతించాలన్నారు. జోన్ల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని వదిలిపెట్టొద్దని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులకు కూడా డీజీపీ పలు సూచనలు చేశారు. బేగంపేట్ చెక్‌పోస్టును కూడా డీజీపీ పరిశీలించారు.












Click it and Unblock the Notifications