తెలంగాణలో కొత్తగా 318 కరోనా కేసులు, ఇద్దరు మృతి: కొత్త కేసుల కంటే రికవరీనే ఎక్కువ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 71,829 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 318 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 318 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,59,007కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3880కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

 318 new corona cases, 2 deaths reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 389 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,49,391కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

ఇది ఇలావుండగా, భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం రెండు నెలల గరిష్టానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మరోపక్క కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 45,352 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు 366 మరణాలు నమోదయ్యాయి. దీనితో, దేశం మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కి పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కి పెరిగింది.

Recommended Video

    Corona Virus India : ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు తగ్గని ఉధృతి || Oneindia Telugu

    గత 24 గంటల్లో 34,791 కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు 3,99,778 కి చేరుకున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతున్న తీరు భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసుల రేటు 1.22 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. నిన్న74 .84 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా 67.09కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    మరోవైపు, కేరళలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా, 1.63 లక్షల నమూనాలను పరీక్షించగా.. 29,322 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.51లక్షలకు చేరింది. గత 24 గంటల్లో కరోనావైరస్ బారినపడి 131 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,280కి పెరిగింది.

    తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,51,455కు పెరిగింది. శుక్రవారం మరో 22,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 38,83,186కు చేరింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,437కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.19 శఆతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
    త్రిస్సూర్‌లో శుక్రవారం అత్యధిక పాజిటివ్ 3,530 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులంలో 3,435 కేసులు, కోజికోడ్ లో 3,344 కరోనా కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+