కరోనా అప్‌డేట్ : తెలంగాణలో 3307 కరోనా కేసులు.. మరో 8 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 13) రాత్రి 8గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 14) రాత్రి 8గంటల మధ్య 3307 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. మరో 3715కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (ఏప్రిల్ 15) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1788కి చేరింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 18,685 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 897 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,08,396కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.52శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 88.83 శాతం ఉండగా తెలంగాణలో 91.22 శాతం ఉంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 446 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,03,60,001 కరోనా టెస్టులు నిర్వహించారు.

 3307 new coronavirus cases and 8 deaths reported in telangana

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1038 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 58వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.

కరోనా నియంత్రణ కోసం మహారాష్ట్రలో సెక్షన్ 144తో పాటు జనతా కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేక వలస కార్మికులు మళ్లీ స్వస్థలాల బాట పట్టారు. ముంబై రైల్వే స్టేషన్లు వేల కొద్ది వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+