తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 6వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా నమోదైన కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 75,102 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు, రెండు మరణాలు

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు, రెండు మరణాలు


తాజాగా, నమోదైన 340 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,57,716కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3872కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1658 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 5891 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 5891 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 359 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,47,953కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 72. జగిత్యాలలో 15, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 42, ఖమ్మంలో 17, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 05, మంచిర్యాలలో 08, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 19, ములుగులో 02, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 25, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 04, పెద్దపల్లిలో 19, రాజన్న సిరిసిల్లలో 09, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 06, సూర్యాపేటలో 11, వికారాబాద్ లో 01, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 08, వరంగల్ అర్బన్‌లో 25, యాదాద్రి భువనగిరిలో 09 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అసిఫాబాద్, వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో 31 విచారణ

తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో 31 విచారణ

ఇది ఇలావుండగా, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ అనే ప్రైవేట్ టీచర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష భోదన సరికాదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. భౌతికదూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్ తరగతుల నిలిపివేత తదితరాలపై స్పష్టత లేదన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకర పత్రం అవసరమో లేదో కూడా పేర్కొనలేదన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో.. ముఖ్యంగా పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని, ఎలాంటి సంసిద్ధత లేకుండా పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. ఇందులో ప్రతిపవాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యా శాఖ డైరెక్టర్, నిపుణుల సలహా కమిటీలను చేర్చారు. కాగా,
ఈ వ్యాజ్యంపై ఆగస్టు 31న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Recommended Video

    Intranasal Covid Vaccine,మరింత బూస్టర్..! || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+