పోలీస్‌స్టేషన్‌పై దాడి: రెచ్చగొట్టిన ఐదుగురితో సహా 35మంది అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన వారిలో 35 మందిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం మారేడ్‌పల్లి మహత్మాగాంధీనగర్ బస్తీకి చెందిన స్థానికుడైన బన్నప్ప(33) మృతి చెందాడనే నెపంతో సుమారు 200 మంది ఆయుధాలతో మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి దుశ్చర్యకు పాల్పడ్డారు.
పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని కొట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాల్లోంచి పెట్రోల్ తీసి పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను, స్టేషన్‌లోని జనరల్ డైరీని దహనం చేశారు.
బన్నప్ప మృతికి పోలీసులే కారణమని ఆరోపించండంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసినట్లు జాయింట్ సీపీ తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటనలపై ఏడు కేసులు నమోదు చేశామని వివరించారు. కాగా, దాడి విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన కార్ఖాన పోలీస్‌స్టేషన్ పెట్రోల్ వాహనాన్ని, రోడ్డుపై వెళ్తున్న రెండు సిటీ బస్సులను ధ్వంసం చేశారు.
స్టేషన్ పరిసరాల్లో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లో అవసరాల కోసం అందుబాటులో ఉంచిన రూ. 39 వేల నగదు, రెండు డ్రాగాన్ లైట్స్, మ్యాన్‌ప్యాక్ వైర్‌లెస్ సెట్, ఒక ల్యాప్‌టాప్, ఇతర కేసులో పోలీసులు సీజ్ చేసి 18 సెల్‌ఫోన్లను ఈ దాడి చేసిన వారు అపహరించారని జాయింట్ సీపీ వివరించారు.

నిందితుల అరెస్ట్
మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన వారిలో 35 మందిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

నిందితుల అరెస్ట్
సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం మారేడ్‌పల్లి మహత్మాగాంధీనగర్ బస్తీకి చెందిన స్థానికుడైన బన్నప్ప(33) మృతి చెందాడనే నెపంతో సుమారు 200 మంది ఆయుధాలతో మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి దుశ్చర్యకు పాల్పడ్డారు.

నిందితుల అరెస్ట్
పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని కొట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాల్లోంచి పెట్రోల్ తీసి పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను, స్టేషన్‌లోని జనరల్ డైరీని దహనం చేశారు.

నిందితుల అరెస్ట్
బన్నప్ప మృతికి పోలీసులే కారణమని ఆరోపించండంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసినట్లు జాయింట్ సీపీ తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటనలపై ఏడు కేసులు నమోదు చేశామని వివరించారు.

నిందితుల అరెస్ట్
కాగా, దాడి విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన కార్ఖాన పోలీస్‌స్టేషన్ పెట్రోల్ వాహనాన్ని, రోడ్డుపై వెళ్తున్న రెండు సిటీ బస్సులను ధ్వంసం చేశారు.

నిందితుల అరెస్ట్
స్టేషన్ పరిసరాల్లో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై దాడి చేశారు.

నిందితుల అరెస్ట్
పోలీస్‌స్టేషన్‌లో అవసరాల కోసం అందుబాటులో ఉంచిన రూ. 39 వేల నగదు, రెండు డ్రాగాన్ లైట్స్, మ్యాన్‌ప్యాక్ వైర్‌లెస్ సెట్, ఒక ల్యాప్‌టాప్, ఇతర కేసులో పోలీసులు సీజ్ చేసి 18 సెల్‌ఫోన్లను ఈ దాడి చేసిన వారు అపహరించారని జాయింట్ సీపీ వివరించారు.

నిందితుల అరెస్ట్
ఈ దాడిలో 101 మంది పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అందులో 35 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

నిందితుల అరెస్ట్
వీరి వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, ఐదు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరిచి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

నిందితుల అరెస్ట్
మారేడ్‌పల్లిలో జరిగిన ఘటన వెనుక ఏ1 గంట రాజు, ఏ4 దశరథ్, ఏ6 గంట సాయిరాం, ఏ9 సున్నపు హన్మంత్, ఏ11 కె.యాదయ్య ప్రధాన సూత్రధారులని జాయింట్ జేసీపీ ప్రభాకర్ రావు వివరించారు. వీరిలో కొందరిపై మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు చెప్పారు.
ఈ దాడిలో 101 మంది పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అందులో 35 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరి వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, ఐదు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరిచి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కాగా, మారేడ్‌పల్లిలో జరిగిన ఘటన వెనుక ఏ1 గంట రాజు, ఏ4 దశరథ్, ఏ6 గంట సాయిరాం, ఏ9 సున్నపు హన్మంత్, ఏ11 కె.యాదయ్య ప్రధాన సూత్రధారులని జాయింట్ జేసీపీ ప్రభాకర్ రావు వివరించారు. వీరిలో కొందరిపై మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు చెప్పారు.
ఏ4గా ఉన్న దశరథ్‌పై రౌడీషీట కూడా ఉందని తెలిపారు. పోలీసులపై అప్పటికే కోపంతో ఉన్న వీరు జరిగిన ఘటనను తమకు అనుకూలంగా మార్చుకొని స్థానిక బస్తీవాసులను రెచ్చగొట్టారన్నారు. దీంతో బస్తీవాసులు ఠాణాపై దాడి చేశారని జాయింట్ కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications