తెలంగాణలో 3వేలకుపైగా కొత్త కరోనా కేసులు: ఐదు ప్రైవేటు ఆస్పత్రుల కోవిడ్ సేవల లైసెన్స్ రద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 97,236 నమూనాలను పరీక్షించగా కొత్తగా 3,527 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,71,044కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3226కి చేరింది.

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 3982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,30,025కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.49 కోట్లకుకుపైగా నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.81 శాతం ఉంది. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.

తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు
ఇక తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 18, భద్రాద్రికొత్తగూడెంలో 154, జీహెచ్ఎంసీలో 519, జగిత్యాలలో 55, జనగాంలో 31, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 48, జోగులాంబగద్వాలలో 54, కామారెడ్డిలో 20, కరీంనగర్‌లో 178, ఖమ్మంలో 215, కొమురంభీంఅసిఫాబాద్‌లో 23, మహబూబ్ నగర్ 124, మహబూబాబాద్ లో 119, మంచిర్యాల్ 88, మెదక్ 40, మేడ్చల్ మల్కాజిగిరి 188, ములుగులో 46 కరోనా కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 81, నల్గొండలో 218, నారాయణపేట్ 26, నిర్మల్‌లో 15, నిజామాబాద్‌లో 47, పెద్దపల్లిలో 144, రాజన్నసిరిసిల్లలో 78, రంగారెడ్డిలో 207, సంగారెడ్డిలో 75, సిద్దిపేటలో 115, సూర్యపేటలో 152, వికారాబాద్‌లో 83, వనపర్తిలో 95, వరంగల్ రూరల్‌లో 96, వరంగల్ అర్బన్ లో 1130, యాదాద్రిభువనగిరి జిల్లాలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
Recommended Video

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కొరఢా
మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. హైదరాబాద్‌లోని ఐదు ఆస్పత్రుల కరోనా సేవల లైసెన్స్‌ను ఆరోగ్యశాఖ రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రితోపాటు బేగంపేటలోని విన్ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రుల కరోనా సేవల లైసెన్సులను రద్దు చేసింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎవరైనా ఆస్పత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే.. 9154170960 నంబర్‌ను సంప్రదించాలని ఇప్పటికే తెలంగాణ డీహెచ్ సూచించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications