తెలంగాణలో కొత్తగా 366 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, జీహెచ్ఎంసీలో మళ్లీ 100 దాటిన కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోసారి హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు నిన్నటికంటే స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 80,470 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 366 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 366 కరోనా కేసులు, రెండు మరణాలు
తాజాగా, నమోదైన 366 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,56,098కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3864కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1387 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 6295 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,45,939కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,295 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.45 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 07, జీహెచ్ఎంసీలో 102. జగిత్యాలలో 08, జనగామలో 04, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 34, ఖమ్మంలో 19, కొమురంభీం ఆసిఫాబాద్ లో 02, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 04, మంచిర్యాలలో 08, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 27, ములుగులో 02, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 24, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 15, రాజన్న సిరిసిల్లలో 06, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 12, సూర్యాపేటలో 08, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 09, వరంగల్ అర్బన్‌లో 27, యాదాద్రి భువనగిరిలో 06 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Recommended Video

విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత టీచర్లే తీసుకోవాలి
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పున: ప్రారంభంపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం నగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ వల్ల పాఠశాలలు మూత పడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలలో ఉండే గిరిజనుల ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దు అని చెప్పారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్ లో పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. 15 రోజుల పాటు జరిగే గిరిదర్శిని కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న అంగన్ వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, గ్రామాల్లోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలను శుభ్రం చేసి, శానిటైజ్ నిర్వహించాలని ఆదేశించారు. కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications