తెలంగాణలో కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ: జిల్లాలవారీగా కరోనా కేసులివే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు 4వేల లోపే నమోదవుతున్నాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం.

తెలంగాణలో కొత్తగా 3660 కరోనా కేసులు, 23 మంది మృతి
గత 24 గంటల వ్యవధిలో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3660 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,44,263కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 23 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3060కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం 574 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4826 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 4,95,446కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.03శాతం ఉంది. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు
ఇక తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-16, భద్రాద్రి కొత్తగూడెం-121, జీహెచ్ఎంసీ-574, జగిత్యాల-93, జనగాం-38, జయశంకర్ భూపాలపల్లి-45, జోగులాంబ గద్వాల-55, కామారెడ్డి-31, కరీంనగర్-147, ఖమ్మం-217, కొమురంభీం ఆసిఫాబాద్-23, మహబూబ్‌నగర్-128, మహబూబాబాద్-72, మంచిర్యాల-108, మెదక్-47, మేడ్చల్ మల్కాజ్‌గిరి-218, ములుగు-51, నాగర్‌కర్నూలు-118, నల్లగొండ-166, నారాయణపేట-33, నిర్మల్-18, నిజామాబాద్-59, పెద్దపల్లి-120, రాజన్న సిరిసిల్ల-66, రంగారెడ్డి-247, సంగారెడ్డి-106, సిద్దిపేట-116, సూర్యాపేట-110, వికారాబాద్-112, వనపర్తి-80, వరంగల్ రూరల్-103, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి-91 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరింత కఠినంగా లాక్‌డౌన్..
తెలంగాణలో డౌన్‌ను మే 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపును కొందరు ఉల్లంఘించడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారి వాహనాలను జప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు నమోదు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని పెట్రోల్ బంకులను లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. దీంతో 24 గంటలపాటు పెట్రోల్ బంకులు పనిచేయనున్నాయి.












Click it and Unblock the Notifications