Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిఫ్ట్-గోడకు మధ్య చిన్నారి తల, 20 ని.లు నరకం: ప్రిన్సిపల్ శాలిని అరెస్ట్ (పిక్చర్స్)

హైదరాబాద్: పాఠశాల లిఫ్ట్‌లో ఇరుక్కొని నాలుగేళ్ల చిన్నారి మంగళవారం ఉదయం మృతి చెందింది. గోడ, లిఫ్ట్ మధ్యలో ఆ చిన్నారి తల ఇరుక్కుంది.

ఆ చిన్నారి దాదాపు ఇరవై నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఆ లిఫ్ట్ సరిగా పని చేయడం లేదు. అంతేకాదు, దానికి లిఫ్ట్ బాయ్ కూడా లేడని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. దిల్‌సుఖ్ నగర్ పరిధిలో నర్సరీలో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

పాఠశాల లిఫ్ట్‌లో ఇరుక్కొని నాలుగేళ్ల చిన్నారి మంగళవారం ఉదయం మృతి చెందింది. గోడ, లిఫ్ట్ మధ్యలో ఆ చిన్నారి తల ఇరుక్కుంది.

చిన్నారి మృతి ఘటన`

చిన్నారి మృతి ఘటన`

ఆ చిన్నారి దాదాపు ఇరవై నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

ఆ లిఫ్ట్ సరిగా పని చేయడం లేదు. అంతేకాదు, దానికి లిఫ్ట్ బాయ్ కూడా లేడని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. దిల్‌సుఖ్ నగర్ పరిధిలో నర్సరీలో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

కథనం మేరకు... సైదాబాద్‌‌లో శ్రీచైతన్య స్టార్ కిడ్స్‌ ప్రీమియం పేరులో ఓ స్కూల్ కొనసాగుతోంది. యాకుత్‌పురాకు చెందిన సయ్యద్‌ ఎజాజ్‌ హుస్సేన్‌ జాఫ్రీ, తహసీన్‌ల కుమార్తె సయ్యదా జైనబ్‌ ఫాతిమా జాఫ్రీ (4) నర్సరీ చదువుతోంది.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

జాఫ్రీ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లడంతో తహసీన్‌ సైదాబాద్‌ గ్రీన్‌లాండ్‌ కాలనీలోని తన పుట్టింట్లో ఉంటోంది. జైనబ్‌ వరుసకు సోదరుడైన ఇక్బాల్‌(4)తో కలిసి పాఠశాల బస్సులో మంగళవారం ఉదయం 8.30గంటలకు పాఠశాలకు వచ్చింది.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

జైనబ్‌ సహా ఉపాధ్యాయురాలు సరోజ, తొమ్మిది మంది పిల్లలు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. లిఫ్ట్‌ మొదటి అంతస్తుకు చేరుకుంటుండగా ఇక్బాల్‌, జైనబ్‌లు క్యారియర్‌ బ్యాగ్‌ కోసం అటూ ఇటూ చూశారు.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

అప్పుడే లిఫ్ట్‌ గ్రిల్‌ తొలగిపోవడంతో జైనబ్‌ ముందుకు పడింది. పడీపడగానే ఆమె తల గోడ-లిఫ్ట్‌ మధ్య ఖాళీ ప్రదేశంలో ఇరుక్కుపోయింది. పిల్లలు కేకలువేస్తూ బయటకువచ్చారు.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన అక్కడకు వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి జైనబ్‌ చనిపోయంది.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని డీసీపీ డాక్టర్‌ వి రవీందర్‌ చెప్పారు, ఈ పాఠశాలకు అనుమతి లేదని, నిబంధనల ప్రకారం లిఫ్టు ఉపయోగించకూడదన్నారు.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌ శాలిని, ఉపాధ్యాయురాలు సరోజను అరెస్ట్ చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పాఠశాలను సీజ్‌ చేసి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

జైనబ్‌ తాతయ్య జయిదీ ఫిర్యాదు మేరకు ఐపీసీ 304ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సీహెచ్‌ సుధాకర్‌ తెలిపారు.

చిన్నారి మృతి ఘటన

చిన్నారి మృతి ఘటన

ఈ సంఘటన జరిగిన వెంటనే పాఠశాల బాధ్యులు సతీష్‌ను అదుపులోకి తీసుకోగా, మరికొంతమంది పరారయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+