40 రోజుల వద్దు, 3 రోజులు చాలు : జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎంపికపై ఈసీతో ఉత్తమ్
హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికక 40 రోజుల గడువు పెట్టొద్దన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నిరోజులు సమయం ఇస్తే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ, సీపీఐ, జనసమితి నేతలతో కలిసి ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తిచేయండి ..
స్థానిక సంస్థల ఫలితాలు ఈ నెల 27న లెక్కించి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు విడుదలైన 3 రోజుల్లో జెడ్పీ చైర్మన్, ఎంపీపీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. లేదంటే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందన్నారు. నల్లధనం ఉపయోగించి ప్రలోభాల పర్వానికి తెరలేపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి పోలీసులు, అధికారులు కూడా సహకరిస్తారని గుర్తుచేశారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలను చేర్చుకున్న టీఆర్ఎస్ ... స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేతీరుగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు.

ప్రలోభాల పర్వానికి తెరతీస్తారు ..
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదల చేసి .. జూలై 5న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ నియామక ప్రక్రియ చేపడుతామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. దీంతో అఖిలపక్ష నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫలితాలు విడుదలైన 3 రోజుల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ నియమించి .. జూలై 5న చార్జీ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయకుంటే మళ్లీ అధికార పార్టీ ప్రలోభాలు కొనసాగుతాయని ఆందోళన చెందారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని అర్థమవుతుందన్నారు.

చట్టాలపై గౌరవం లేదు ..
సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. చట్టాలపై ఆయనకు ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎన్నికల కమిషనర్ ను కోరినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications