49 మందికి పాజిటివ్: గలీజుగా సిటీ కల్చర్..?, బర్త్ డే, పార్టీల పేరుతో గుంపులు, గుంపులు..

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి నమోదవుతున్న 40 కేసుల్లో సింహాభాగం ఇక్కడే వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్‌లో వలసకూలీలకు పాజిటివ్ కేసులు తక్కువే. కానీ బర్త్ డే అని పార్టీల పేరుతో సెలబ్రేట్ చేసుకోవడంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యం. పార్టీలు చేసుకోగా బయటపడ్డ పాజిటివ్ కేసులు 49 వరకు ఉన్నాయంటే.. కొందరు సిటీ జనాలు ఎంత అజాగ్రత్తతో ఉన్నారో అర్థమవుతోంది. భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని పాలకులు, పోలీసులు, వైద్యులు నెత్తి, నోరు బాదుకుంటోన్న నాగరిక ప్రజలు చెవికెక్కించుకోవడం లేదు. దీంతో సిటీలో కరోనా కేసులు క్రమేణ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

బర్త్‌డేకి వెళ్లడంతో 23 మంది..

బర్త్‌డేకి వెళ్లడంతో 23 మంది..

శనివారం మాదన్నపేటలో ఓ అపార్ట్ మెంట్‌లో బర్త్ డే వేడుక జరిగింది. 50 మంది వరకు పార్టీకి హాజరయ్యారు. అయితే అందులో 23 మందికి వైరస్ సోకింది. అందులో ఒకరికి పాజిటివ్ ఉండగా.. మిగిలిన వారు గూమికూడగా వైరస్ సోకింది. మిగిలిన 27 మంది వివరాలు సేకరించి... వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. వారికి కూడా పాజిటివ్ వస్తే.. వైరస్ సోకిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గెట్ టు గెదర్ పేరుతో ఒకేచోట ఉండటంతో వైరస్ సోకుతోంది. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌పై అధికారులు దృష్టిసారించారు. వారు ఎవరిని కలిశారు...? ఎవరితో చనువుగా మెలిగారనే అంశంపై వివరాలు ఆరాతీస్తున్నారు.

12 మందికి

12 మందికి

ఇటీవల ఎల్బీనగర్‌లో కూడా బర్త్ డే పార్టీ నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన 12 మందికి కరోనా వైరస్ సోకింది. మలక్ పేట గంజ్‌లో వ్యాపారం చేసే సరూర్ నగర్‌క్ చెందిన ఒకరు పార్టీకి హాజరయ్యారు. అతనికి వైరస్ ఉండటంతో.. మిగిలినవారికి వ్యాపించిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వైరస్ సోకిన వెంటనే బయటపడం లేదు. 14 రోజులు కాదు కదా.. 20 రోజులకు కూడా లక్షణాలు బయటపడటం లేదు. దీంతో తాము ఆరోగ్యంగానే ఉన్నామనుకొని.. కొందరు పార్టీలకు అటెండవుతున్నారు. తెలియకుండానే మరొకరికి వైరస్ అంటిస్తున్నారు. వాస్తవానికి విందులు, వినోదాలు వద్దు అని.. దూరంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొందరు వినిపించుకోకపోవడంతో అనర్థాలు జరుగుతున్నాయి.

Recommended Video

    Coronavirus Tension In Hyderabad SBI Bank, 11 Employees Sent To Quarantine
     నలుగురికి

    నలుగురికి

    ఓల్డ్ మలక్ పేట, గుడి మల్కాపూర్‌లో కొన్ని పార్టీలు నిర్వహించారు. అక్కడికి వెళ్లిన నలుగురికి వైరస్ సోకింది. ఇలా చాలా చోట్ల పార్టీలు జరపడం వల్లనే వైరస్ సోకుతోంది. వారి కేసులే 49 వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీలు, వేడుకలు అంతా ఇంపార్టెంట్ అనుకుంటే వీడియో కాల్ చేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీంతో తమవారిని చూసినట్టు ఉంటుంది.. పార్టీకి వెళ్లలేమనే చింత ఉండదని చెబుతున్నారు. ఇదే మంచి విధానం అని.. పాటించాలని కోరుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+