4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..
సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెలంగాణలో కూడా పండగ శోభ మూడురోజుల పాటు ఉంటోంది. పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడిపిస్తామని ప్రకటించింది.
సంక్రాంతి పండగకు ఆయా రూట్లలో 4940 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. సంక్రాంతి పండగకు నాలుగు రోజుల ముందు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించింది. గురువారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో స్పెషల్ బస్సుల వివరాలను అధికారులు వివరాలను తెలియజేశారు.

హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. వరంగల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ వెళ్లాలని, కరీంనగర్ వారు జేబీఎస్ నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో రద్దీ తగ్గుతుందని, పండగ సమయాల్లో ట్రాఫిక్‌ను ఈ విధంగా కంట్రోల్ చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో వెళ్లేవారు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించినట్టు వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications