తెలంగాణలోని 27వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు: మంత్రి హరీశ్ రావు

కామారెడ్డి: తెలంగాణలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు వైద్యారోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు.

ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

 4g Smartphones to 27k Asha workers in telangana: Harish Rao.

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్లలకు రూ.4వేలు వేతనమే ఇస్తున్నారని.. అదే తెలంగాణలో మాత్రం రూ.9,750 వేతనం ఇస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 3వేలే ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి కాయకాల్ప అవార్డు రావడం సంతోషకరమన్నారు. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న మంత్రి హరీశ్ రావు.. పని చేయకుంటే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, డాక్టర్లు బాగా పని చేస్తే శాశ్వత నియామకాల్లో వేయిటేజీ కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఆశా కార్యకర్తలు జీతం కోసం గతంలో పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని.. సీఎం కేసీఆర్ మాత్రం ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని జీతాలను రూ.9750కి పెంచారన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 3లో ఉందన్నారు. మోడీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని హరీష్‌రావు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మొదటి స్థానంలోకి వెళ్లేందుకు అందరం కృషి చేద్దామన్నారు. జుక్కల్ ఆస్పత్రిలో ఒక డాక్టర్ విధులు నిర్వర్తిస్తూ మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏఎన్ఎం చనిపోతే కుటుంబానికి 50 లక్షల చెక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+