వారం రోజుల్లో కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సు: ఖరీదు రూ. 5 కోట్లు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు అత్యాధునిక వసతులతో కూడిన బుల్లెట్ ప్రూఫ్‌తో తయారైన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. చంఢీగడ్‌కు చెందిన జేసీబీఎల్ కంపెనీ రెండు బస్సులకు తుది మెరుగులు దిద్దుతోంది.
ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల తయారీకి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ. 5 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. కేసీఆర్ కోసం రూపొందుతున్న బస్సు రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు కోసం రూపొందుతున్న బస్సు వచ్చేందుకు మరి కాస్తంత సమయం పడుతుందని సమాచారం.
ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వారి యొక్క జిల్లాల పర్యటనలను ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. సీఎంలతో పాటు వారి వ్యక్తిగత భద్రత సిబ్బంది, అధికారులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సుల్లో 17 నుంచి 20 వరకు అత్యాధునిక సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బస్సుల్లో ప్రయాణిస్తూనే చంద్రబాబు, కేసీఆర్‌లు తమ రాష్ట్రాల పాలనా వ్వవహారాలను కూడా చక్కబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెలివిజన్లతో పాటు శాటిలైట్ లాంటి సౌకర్యాలు కూడా వీటిలో ఏర్పాటు కానున్నాయి.

బుల్లెట్ ప్రూఫ్ బస్సు ప్రత్యేకతలు:
* బుల్లెట్లకు దెబ్బతినదు.
* అగ్ని నుంచి రక్షణ ఇస్తుంది.
* పెద్ద పద్ద బ్లాస్టింగ్‌లను తట్టుకుంటుంది.
* అత్యాధునిక సౌకర్యాలు
* బాత్ రూమ్ తరహాలో ఏర్పాట్లు












Click it and Unblock the Notifications