భర్త వదిలేశాడు, ప్రియుడు ఆస్పత్రిలో పడేశాడు: తల్లి శవం పక్కన పడుకున్న బాలుడు

Posted By:
Subscribe to Oneindia Telugu
  A Boy Sleeping Next To His Lifeless Mother Goes Viral

  హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో ఓ కన్నీటి కథ వెలుగు చూసింది. ఉస్మానియా ఆస్పత్రిలో తల్లి శవం పక్కన ఐదేళ్ల బాలుడు పడుకుని అక్కడి నుంచి లేవనని మొండికేశాడు. అయితే, తల్లి మరణించినట్లు ఆ పసివాడికి తెలియలేదు.

  కాటేదాన్‌కు చెందిన 36 ఏళ్ల సమీనా సుల్తానాను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పడేసి వెళ్లిపోయాడు. ఆమెన చూడడానికి మరో వ్యక్తి లేడు. గుండెపోటుతో ఆమె మరణించింది.

  మూడేళ్ల క్రితం భర్త వదిలేశాడు

  మూడేళ్ల క్రితం భర్త వదిలేశాడు

  సమీన దీన గాధ గురించి టైమ్స్ ఇండియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. భర్త అయూబ్ సమీనాను మూడేళ్ల క్రితం వదిలేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో మరణించిన తల్లి పక్కన ఐదేళ్ల షోయబ్ పడుకుని అక్కడి నుంచి లేవనని మొండికేశాడు. ఆస్పత్రి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు చెప్పినా అతను వినలేదు.

  హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వారు

  హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వారు

  ఆస్పత్రి వర్గాలు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. దాంతో పౌండేషన్‌కు చెందిన ఇమ్రాన్ మొహమ్మద్ అక్కడికి వెళ్లాడు. తల్లి పక్కన పడుకున్న పసివాడిని ఒప్పించి శవాన్ని మార్చురీకి తరలించడానికి కొన్ని గంటల సమయం పట్టింది..

  మరో వార్డుకు తరలిస్తున్నామని చెప్పి...

  మరో వార్డుకు తరలిస్తున్నామని చెప్పి...

  మరో వార్డుకు తల్లిని తరలిస్తున్నట్లు బాలుడ్ని నమ్మించి శవాన్ని మార్చరీకి తరలించారు. ఆమె పక్కన నా అనేవారెవరూ లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు మెడికో లీగల్ కేసుగా పరిగణించి మైలారుదేవపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  ఇలా చెప్తే గానీ వినలేదు...

  ఇలా చెప్తే గానీ వినలేదు...

  వైద్యులు ఆమెను బతికించడానికి చాలా కష్టపడ్డారని, అయితే అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఆమె మరణించిందని ఇమ్రాన్ మొహమ్మద్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిసంది. బాలుడికి నచ్చజెప్పే సరికి ఉదయం 2 గంటలైందని చెప్పాడు.

  చివరకు ఇలా చేశారు...

  చివరకు ఇలా చేశారు...

  మృతురాలి సంచీలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మెదక్ జిల్లాలోని జహీరాబాదులో మహిళ బంధువులు ఉన్నట్లు మైలారుదేవపల్లి పోలీసులు గుర్తించారు. సమీనా కుమారుడిని ఆమె సోదరుడు ముస్తాక్ పటేల్‌కు అప్పగించామని ఇన్‌స్పెక్టర్ పి. జగదీశ్వర్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to Times of India - A five-year-old boy lay fast asleep alongside his mother's lifeless body at the state-run Osmania general hospital on Sunday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి