వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో 50 మంది ఎన్ఆర్ఐ భర్తలు భార్యలను వదిలేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :విదేశాల్లో పనిచేసే అబ్బాయికి తమ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనే తల్లి దండ్రులు ఒక్క క్షణం ఆలోచించండి. ఎన్ ఆర్ ఐ లు అనగానే ఎగిరి గంతేసి పెండ్లికి ఒప్పేసుకొంటాం. అడిగిన కట్నంతో పాటు కానుకాలు ఇచ్చేందుకు తల తాకట్టు పెట్టే తల్లిదండ్రులు కూడ లేకపోలేదు. అయితే ఎన్ ఆర్ ఐ లను పెళ్ళిచేసుకొని మోసపోయిన వారి సంఘటనలు కూడ అంతే సంఖ్యలో నమోదౌతున్నాయి.ఎన్ ఆర్ ఐ లు అదనపు కట్నం కోసం తమ భార్యలను వదిలేస్తున్నారని మహిళ కమీషన్ అధ్యయనంలో తేలింది.

ఎన్ ఆర్ ఐల నువివాహం చేసుకొనే సమయంలో జాగ్రత్తలను తీసుకోవాలని మహిళా కమీషన్ కోరుతోంది. ఎన్ ఆర్ ఐ వివాహాలు చేసుకొన్న కుటుంబాలను మహిళా కమీషన్ అధ్యయనం చేసింది.ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.200 మంది ఎన్ ఆర్ ఐలు అదనపు కట్నం కోసం భర్తలు వేదించారని మహిళా కమీషన్ చైర్మెన్ త్రిపురాన వెంకటరత్నం చెప్పారు.

50 nris divorced in telangana

ఎన్ ఆర్ ఐల ను వివాహాం చేసుకొన్న వారిలో భర్తలు వదిలేసిన మహిళల్లో అత్యధికంగా తెలంగాణకు చెందిన వారున్నారని మహిళా కమీషన్ చైర్ పర్సన్ వెంకటరత్నం చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 50 మందిని ఎన్ ఆర్ ఐ లు వదిలేశారని ఆమె చెప్పారు.అమెరికా, యూకె, యూఎఇ దేశాల్లోని కోర్టులు ఈ కేసులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆమె చెప్పారు.

అదనపు కట్నం కోసం వేధించే ఎన్ ఆర్ ఐ లను స్వదేశానికి రప్పించడం కష్టంగా మారిందన్నారు.విదేశీ చట్టాల వల్ల కొంత ఇబ్బందులు చోటుచేసుకొంటున్నాయని ఆమె తెలిపారు.విడాకుల విషయంలో విదేశీ చట్టాలు భారత మహిళలకు ప్రతిబంధకంగా ఉన్నాయని ఈ అంశాన్ని ఎన్ ఆర్ ఐలు తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారని ఆమె చెప్పారు.

English summary
nris demanded additonal money from wifes.telangana mahila chair person study about nris marrage. 200 nris demanded additional money from wife.highest divorced ladies from telangana state.50 ladies got divorce said telangana mahila commission chair person.foreign act are favour for nris said venkat ratnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X