హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 ఏళ్ల బాలికపై వరుసగా మూడు రోజులు రేప్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని హుస్సేనీ ఆలంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. యాభై ఏళ్ల వయస్సు గల వయ్క్తి ఎనిమిదేళ్ల బాలికపై వరుసగా మూడు రోజులు అత్యాచారం చేసిన సంఘటన వెలుగు చూసింది.

అత్యాచారానికి పాల్పడిన మొహమ్మద్ సిరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఫతే దర్వాజాకు చెందినవాడు. సిరాజ్‌కు వివాహం కాలేదు. అతను కంసాలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతర బాలికలను కూడా అతను లక్ష్యం చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజుల తర్వాత తల్లికి విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు పేట్లబురుజులో గల ప్రభుత్వ ప్రసూత వైద్యశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

అంగీకరించాడు...

అంగీకరించాడు...

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. బాలిక తన ఇంటికి ఒంటరిగా వచ్చిందని, దాన్ని అవకాశంగా తీసుకుని లైంగిక దాడి చేశానని అతను చెప్పాడు.

చాక్‌లెట్లు, డబ్బు ఇచ్చి...

చాక్‌లెట్లు, డబ్బు ఇచ్చి...

బాలికకు సిరాజ్ చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి డిసెంబర్ 31వ తేదీన తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి, దుర్మార్గానికి ఒడిగట్టాడు.

మూడో రోజు నిరాకరించింది...

మూడో రోజు నిరాకరించింది...

మూడు రోజులు వరుసగా తన ఇంటికి తీసుకుని వెళ్లిన సిరాజ్ తనను ఏం చేస్తున్నాడో కూడా బాలిక అర్థం చేసుకోలేకపోయింది. మూడో రోజు ఆమెపై అత్యాచారం చేశాడు. మర్నాడు అతని ఇంటికి వెళ్లడానికి బాలిక నిరాకరించింది.

అనుమానించిన తల్లి...

అనుమానించిన తల్లి...

కూతురు తీరుపై అనుమానం వచ్చి తల్లి ప్రశ్నించడంతో బాలిక విషయం చెప్పింది. దీంతో తల్లి హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారంనాడు సిరాజ్‌ను అరెస్టు చేశారు.

English summary
A 50-year-old paedophile was arrested by the South Zone police for raping an eight-year-old girl for three days at Hussaini Alam. Mohd Siraj, a resident of Fateh Darwaza, lured the girl from his neighbourhood with money and chocolate before sexually assaulting her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X