వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివ్వెరపోయే నిజాలు : తెలంగాణ-ఏపీల్లో 56మంది చిన్నారులపై రేప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహిళా భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. జాతీయ నేర విభాగం విడుదల చేసిన క్రైమ్ గణాంకాల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం.. ఒక్క 2015లోనే 66 మంది చిన్నారులు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలకు గురయ్యారు.

గతంతో పోల్చి చూస్తే.. ఒక్కసారిగా అత్యాచార నేరాలు పెరిగిపోవడం గమనార్హం. మొత్తంగా.. 2100 మంది మహిళలు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం అత్యాచారానికి గురైనట్లుగా క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది అత్యాచార బాధితులు 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హం.

56 infants were raped in Telangana, AP in 2015: NCRB data

60 ఏళ్లు పైబడ్డ వృద్ద మహిళలపై కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. 2015లో ఆరుగురు వృద్ద మహిళలు తెలంగాణలో అత్యాచారానికి గురికాగా, ఏపీలో ముగ్గురు వృద్ద మహిళలు అత్యాచారానికి గురయ్యారు.

56 infants were raped in Telangana, AP in 2015: NCRB data

దేశం మొత్తం మీద మహిళలపై చోటు చేసుకుంటున్న నేరాల్లో.. 9.5 శాతం నేరాలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇక గ్యాంగ్ రేప్ ల విషయంలోను, మహిళల అపహరణలోను, వరకట్న చావుల్లోను, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ నేరాలు నమోదైనట్లుగా క్రైమ్ బ్యూరో గణంకాలు చెబుతున్నాయి.

ఇక కేసుల విషయానికొస్తే.. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి గత సంవత్సరం ఏపీలో 15,931 కేసులు నమోదైతే.. తెలంగాణలో 15,131 కేసులు నమోదయ్యాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిబంధనల నేపథ్యంలోనే చాలామంది మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఘటనలపై ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే గతంతో పోలిస్తే 2015లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని అంటున్నారు తెలంగాణ-ఏపీ పోలీస్.

English summary
Fifty six infants were raped in Telangana and AP in 2015, says data released by the National Crime Records bureau. Telangana and AP registered a steep jump in rape cases in 2015. compared to previous years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X