తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 500కుపైనే కొత్త కేసులు, హైదరాబాద్‌లోనే సగానికపైగా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.తాజాగా, మరోసారి 500కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతకుముందు రోజుతో(448) పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 27,249 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 562 మందికి కరోనా సోకినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరిలో 52 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు ఒక్కరోజు వ్యవధిలో 616 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం.

562 new coronavirus cases reported in telangana state

తెలంగాణలో ఇప్పటి వరకు 8,07,134 కరోనా కేసులు నమోదు కాగా, 7,97, 911 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,112కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4,111గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. మరోవైపు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశం మంగళవారం 13,615 తాజా కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 20 కొత్త మరణాలు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+