రంగారెడ్డి జిల్లాలో మారణకాండ- రెండు కుటుంబాలకు చెందిన ఆరుమంది హత్య
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని దైవాలగూడలో ఈ తెల్లవారుజామున ఆరుమంది దారుణ హత్యకు గురయ్యారు. పోక్సో కేసు నిందితుడు వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనలో జిల్లా మొత్తం ఉలిక్కి పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ గ్రామం మొత్తాన్నీ విషాదంలో ముంచెత్తింది.
హత్యకు గురైన వారిని సరిత, ఆమె పిల్లలు పరీక్షిత్, రుద్రవాన్స్, లక్ష్మి, రుక్కమ్మగా గుర్తించారు. మృతుల్లో పోక్సో బాధితురాలు 17 సంవత్సరాల బాలిక ఉన్నారు. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని హతమార్చినట్లు వెల్లడించారు. బాలిక హత్యచేయడానికి ముందు అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడి పేరు రాజ్ కుమార్. అదే గ్రామానికి బాలికను వేధించాడంటూ మే 16న అతనిపై పోక్సో కింద కేసు నమోదైంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే నెల 26వ తేదీన అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో రాజ్ కుమార్ శుక్రవారమే బెయిల్ పై విడుదలై దైవాలగూడకు తిరిగి వచ్చాడు. కొద్ది గంటల్లోనే ఈ మారణకాండకు పాల్పడ్డాడు. ముందుగా తన ఇంటికి వెళ్లి భార్య సరిత, మూడు, రెండు సంవత్సరాల వయస్సున్న పిల్లలను కత్తితో పొడిచి చంపాడు.
అనంతరం నేరుగా బాధిత బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మలను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై బాధిత బాలికను గ్రామం శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. షాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications