తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోసారి హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,08,921 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 609 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు, 4 మరణాలు

తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు, 4 మరణాలు

తాజాగా, నమోదైన 609 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,46,606కు చేరింది. కరోనాతో కొత్తగా నలుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3811కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1541 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 8,777 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 8,777 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,34,018కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,777 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.05 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

Recommended Video

    Delta Variant Spreads From Nanjing to Beijing In China | Oneindia Telugu
    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 19, జీహెచ్ఎంసీలో 81. జగిత్యాలలో 25, జనగామలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 67, ఖమ్మంలో 51, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 06, మహబూబాబాద్‌లో 10, మంచిర్యాలలో 14, మెదక్‌లో 05, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 36, ములుగులో 04, నాగర్ కర్నూలులో 04, నల్గొండలో 48, నారాయణపేటలో 04, నిర్మల్‌లో 03, నిజామాబాద్‌లో 04, పెద్దపల్లిలో 39, రాజన్న సిరిసిల్లలో 28, రంగారెడ్డిలో 36, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 11, సూర్యాపేటలో 17, వికారాబాద్ లో 05, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 07, వరంగల్ అర్బన్‌లో 41, యాదాద్రి భువనగిరిలో 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+