తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు: ముగ్గురు మృతి, 8వేల దిగువకు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచినకొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 56,178 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 612 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516కి చేరింది.
గురువారం కరోనా బారినపడి ముగ్గురు మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1485కు చేరింది. కరోనాబారి నుంచి గురువారం ఒక్క రోజే 502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,67,427కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 7604 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 5511 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 60,29,209కి చేరింది.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గురువారం 8,72,497 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 29,398 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 97,96,769 మందికి కరోనా సోకింది.
ఇక కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 93 లక్షలకు చేరువవుతోంది. ప్రస్తుతం దేశంలో 3,63,749 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 414 మంది కరోనా కారణంగా మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,42,186కు చేరింది. దేశంలో గత దాదాపు నెల రోజులుగా 40వేల లోపే కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications