కరోనా: తెలంగాణలో తగ్గిన మరణాలు -కొత్తగా 622 కేసులు, ఇద్దరు మృతి -గ్రేటర్ పరిధిలో ఇలా

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులు పెరిగినా, కొత్త కేసులు తక్కువగానే వస్తుండటం, మరణాలు కూడా తగ్గడం శుభపరిణామంగా ఉంది. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాలు ఇలా ఉన్నాయి..

Recommended Video

    Telangana Reports 609 New COVID-19 Positive Cases, 3 Deaths

    తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఒక్కోరోజే కొత్తగా 622 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 73వేల 341కి, మరణాల సంఖ్య 1472కు పెరిగాయి. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.5 శాతంకాగా, తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్ పరిధిలోని జిల్లాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం.

    622 new COVID-19 cases, two deaths in Telangana, tally over 2.73 lakh

    రాష్ట్రవ్యాప్తంగా 622 కొత్త కేసులు వస్తే.. వాటిలో 104 హైదరాబాద్ లో, 51 కేసులు మేడ్చల్ మల్కాజిగిరిలో, 55 కేసులు రంగారెడ్డి జిల్లాలోనే నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క కేసూ లేని నారాయణపేట జిల్లాలో శనివారం కొత్తగా 2 కేసులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఒక్కోరోజే 57,308 టెస్టులు చేపట్టామని, మొత్తంగా ఇప్పటివరకు 57లక్షల 79వే 490 శాంపిళ్లను పరిక్షించామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక

    తెలంగాణలో నిన్న ఒక్కోరోజే 993 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,63,744కి చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.3 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం అది 96.48 శాతం ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 6,116 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+